ట్విటర్ ప్రీమియం సేవలను డిసెంబర్ 12 నుంచి ప్రారంభించనుంది. ప్రత్యేక అదనంగా చెల్లించిన వారు ట్విటర్ బ్లూ చెక్‌మార్ ్క తో పాటు, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ట్విటర్ బ్లూ సేవలను కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. బ్లూ సేవలను ప్రత్యేక రుసుం చెల్లించిన ఎవరికైనా ఇవ్వనున్నారు. ట్విటర్ బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించే విధానాన్ని ఎలాన్ మస్క్ గత నెలలోనే ప్రవేశపెట్టారు. దీంతో భారీ సంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.
దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దాన్ని నిలిపేశారు. ఇప్పుడు వీటిలో సవరణలు తీసుకు వచ్చి తిరిగి ప్రవేశపెట్టారు. వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లుగా ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ యూజర్లు మాత్రం 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. యూపిల్ తమ ప్లే స్టోర్ నుంచి యాప్‌లకు చేసే చెల్లింపులప 30 శాతం ఫీజు వసూలు చేస్తోంది. దీంతో ఐఫోన్ యూజర్ల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేయాలని ట్విటర్ నిర్ణయిం చింది.