దేశం పేరు ఇండియా బదులుగా భారత్ అని మారుస్తారని చర్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ లాజిస్టిక్ సంస్థ బ్లూడార్ట్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ప్రీమియం సేవల్లో ఒకటైన డార్ట్ ప్లస్ సేవలను ఇక నుంచి భారత్ డార్ట్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. బ్లూడార్ట్ ప్రయాణంలో ఇదో మైలురాయిని, తమ వ్యూహాత్మక మార్పుకు నిదర్శనమని బ్లూడార్ట్ తెలిపింది. భారత్ అవసరాలను తీర్చడంతో తమ నిబద్ధతను ఇది తెలియచేస్తుందని తెలిపింది. భారత్‌ను ప్రపంచానికి అనుసంధానం చేసే ఈ ప్రయాణంలో భాగస్వామ్య పక్షాలన్నీ పాలుపంచుకోవాలని బ్లూడార్ట్ కోరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement