దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం భారీ నష్టాలతో ముగిసింది. వరుసగా ఐదో రోజు సూచీలు నష్టోయాయి. ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాంతో, ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర నష్టాలు వచ్చాయి.
వారం ముగింపు ప్రకాశవంతంగా కనిపిస్తున్నప్పటికీ రోజంతా ఒడిదుడుకుల మధ్య మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. గత రెండేళ్లలో ఇంత భారీ నష్టం రావడం… జూన్ 2022 తర్వాత ఇదే అతిపెద్ద పతనం అని నిపుణులు తెలిపారు.
కాగా, ఈరోజు (శుక్రవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద స్థిరపడి, నిఫ్టీ 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద ముగిసింది.