ప్రముఖ క్రిఎ్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ మరోసారి 40 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇకపై ఉండకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా క్రమంగా దిగివస్తున్నందున రేట్ల కోత వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కావచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే బిట్ కాయిన్ ర్యాలీకి దోహదం చేస్తోంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.37 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో బిట్‌కాయిన్ విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడు రోజుల్లో ఈ కాయిన్ దాదాపు 10 శాతం పెరిగింది. మరో కీలక కాయిన్ ఇథేరియం గత 24 గంటల్లో 3.3 శాతం, 7 రోజుల్లో 8.5 శాతం పుంజుకుంది. 2023లో ఇప్పటి వరకు బిట్‌కాయిన్ 146 శాతం పుంజుకుంది.
చివరిసారి 2022 ఏప్రిల్‌లో 40 వేల డాలర్ల మార్క్ వద్ద ట్రేడైంది. ఈ సమయంలో టెర్రాాయూఎస్డీ స్టేబుల్ కాయిన్ పతనంతో క్రిఎ్టో మార్కెట్లో రెండు లక్షల కోట్ల డాలర్ల సంపద అవిరైన విషయం తెలిసిందే. మరోవైపు బ్లాక్‌రాక్ కంపెనీ తొలి అమెరికా స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికి జనవరిలో అనుమతి లభించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువుడుతున్నాయి.
ఇది కూడా క్రిఎ్టో కరెన్సీ పుంజుకోవడానికి దోహదం చేస్తోంది. దివాలా తీసిన క్రిఎ్టోఎక్స్చేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. మరోవైపు బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ ఝావో అనేక ఆరోపణలతో క్రిఎ్టో పరిశ్రమ నుంచరి వైదొలిగారు. ఈ రెండు పరిణామాలు 2022 నాటి పతనం నుంచి కోలుకోవడానికి క్రిఎ్టో కరెన్సీలకు అవాతంరాలుగా నిలిచాయి. లేదంటే ఇప్పటికే బిట్‌కాయిన్ విలువ 50 వేల డాలర్ల మార్క్‌ను అందుకుని ఉండేదని నిపుణుల అంచనా.