చరిత్రలో మొదటిసారి బిట్ కాయిన్ లక్ష డాలర్ల విలువను దాటింది. అమెరికాలో మారిన రాజకీయ పరిస్థితులు, మారిన గ్లోబల్ రెగ్యులేషన్స్, సంస్థాగత పెట్టుబడులు పెరగడం వంటి కారణాలు ఇందుకు దోహదం చేశాయి. క్రిఎ్టో కరెన్సీకి అనుకూలంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో బిట్ కాయిన్ విలువ పెరుగుతూ వచ్చింది.
మన ఇండియన్ కరెన్సీలో బిట్ కాయిన్ విలువ సుమారు 84 లక్షల రూపాయలకు చేరింది. ట్రంప్ వచ్చిన తరువాత నాలుగు వారాల్లోనే దీని విలువ 45 శాతం పెరిగింది. క్రిఎ్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తామని ట్రంప్ హామి ఇచ్చారు. ఇలా ఆయన హామి ఇచ్చిన కొన్ని గంటల్లోనే బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్ల మార్క్‌ను దాటింది.
ఎస్‌ఈసీ ఛైర్మన్‌గా పాల్ అట్కిన్స్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన బిట్ కాయిన్ విలువ పెరుగుదలలో కీలకంగా ఉందని మడ్‌రెక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఈడెల్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ నియామకంతో క్రిఎ్టో కరెన్సీకి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయన్న నమ్మకం ఏర్పడింది. దీంతో బిట్ కాయిన్ విలువ పెరుగుతోందని పటేల్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఇది 1,20,000 డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు.
పాల్ అట్కిన్ గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా పని చేసిన కాలంలోనూ ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ట్రంప్ మళ్లిd ఆయన్నే ఎస్‌ఈసీగా నియమించారు. అమెరికా ఎన్నికల రోజున బిట్ కాయిన్ విలువ 69,374 డాలర్లుగా ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇది 17,00 డాలర్లకు పడిపోయింది.
ఇండియన్ ఇన్వెస్టర్లు కొనవచ్చా…
భారత్‌కు చెందిన ఇన్వెస్టర్లు కూడా బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టవచ్చని కోయిన్‌పార్ ్క సీఈఓ తంగపాండి దురై అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఇన్వెస్టర్లకు క్రిఎ్టో కరెన్సీలు గణనీయమైన మూలధన లాభాలను అందిస్తాయని, బిట్‌కాయిన్ డిజిటల్ గోల్డ్‌గా భావిస్తున్నారని చెప్పారు. 2013లో బిట్‌కాయిన్ ధర 1000 డాలర్లుగా ఉంటే, నేడు అది లక్ష డాలర్లు దాటిందని చెప్పారు.