Thursday, November 21, 2024

Bitcoin | 57 వేల డాలర్లకు ఎగువకు బిట్‌కాయిన్‌

ప్రముఖ క్రిఎ్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ మళ్లిd పుంజుకుని రెండేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2021 తరువాత తొలిసారి 54 వేల డాలర్లను దాటింది. ఓ దశలో 57 వేల డాలర్ల పైకి చేరుకున్న బిట్‌కాయిన్‌ ప్రస్తుతం 56 వేల ఎగువన ట్రేడవుతోంది. మరో క్రిఎ్టో కరెన్సీ ఏథీరియం కూడా 3200 మార్కు ఎగువన కొనసాగుతోంది. 2022 తరువాత ఈ క్రిఎ్టోకు ఇదే గరిష్టం. అమెరికాకు చెందిన ప్రముఖ క్రిఎ్టో ఇన్వెస్టర్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోస్ట్రాటజీ ఇటీవల 155 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 3వేల బిట్‌ కాయిన్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీనికితోడు బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌కు అమెరికా ఆమోదం తెలపడం కూడా క్రిఎ్టోలు రాణించడానికి మరో కారణం. ఈ కారణంతోనే బిట్‌కాయిన్‌లో చాలా రోజుల తరువాత మళ్లి కనుగోళ్లు వెల్లువెత్తాయి.

2021లో క్రిఎ్టో కరెన్సీలు బాగా రాణించాయి. ఈ ఏడాది జీవనకాల గరిష్టాలను అందుకున్నాయి. బిట్‌కాయిన్‌ ఓ దశలో 60 వేల మార్కును దాటింది. ఈ తరువాత వివిధ కారణాల వల్ల క్రిఎ్టో విలువలు భారీగా క్షీణించాయి.చాలా రోజుల పాటు 20 వేల స్థాయిలోనే కొనసాగిన బిట్‌కాయిన్‌ 2 ఏళ్ల తరువాత మళ్లిd పుంజుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇన్నాళ్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. త్వరలో రేట్ల కోత చేపట్టే అవకాశం ఉంది. దీని కారణంగా మదుపరులు క్రిఎ్టోల వపు మళ్లుతున్నారని ఈ కారణంగానే వాటికి డిమాండ్‌ పెరుగోతందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement