Saturday, November 23, 2024

Airportలో బయోమెట్రిక్‌ ఇమిగ్రేషన్‌ చెక్‌.. త్వరలో అమల్లోకి

ఢిల్లి, ముంబై, బెంగళూర్‌ ఎయిర్‌పోర్టుల్లో త్వరలోనే బయోమెట్రిక్‌ ఇమిగ్రేషన్‌ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌కు దీన్ని అమలు చేయనున్నారు. మన దేశ ఎయిర్‌పోర్టులను గ్లోబల్‌ ట్రాన్సిట్‌ హబ్‌గా మార్చేందుకు వీలుగా బయోమెట్రిక్‌ తనిఖీలను ప్రవేశపెట్‌లని ప్రభుత్వం నిర్ణయించింది. న్యూఢిల్లి, ముంబై, బెంగళూర్‌ ఎయిర్‌పోర్టుల్లో ఆటోమెటిక్‌ ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారి పాస్‌పోర్టును తనిఖీ చేయకుండా ఫేస్‌ రికగ్నినేషన్‌, లేదా ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారిత ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, అమలుపై కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా గత వారంలో ఏయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్‌, ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టుల సీఈఓలతో చర్చించారు. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు ఉపయోగిస్తున్న డిజీయాత్ర యాప్‌ను అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఉపయోగించేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆయన కోరారు.

- Advertisement -

డిజీయాత్ర యాప్‌ను నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ డిజీ యాత్ర పౌండేషన్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఫోటోటైప్‌ ఎలక్ట్రానిక్‌ పాస్‌పోర్ట్‌ ఆధారిత ఎన్‌రోల్‌మెంట్‌ విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలో ఉందని డిజీయాత్ర ఫౌండేషన్‌ సీఈఓ సురేష్‌ ఖడక్‌భావ్‌ చెప్పారు. దీని అమలు కోసం ఇ-పాస్‌పోర్టులను వినియోగించేందుకు ఇమిగ్రేషన్‌ అధికారులు, వీసా జారీ చేసే ఏజెన్సీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. మన దేశంలోకి మొదటి సారి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులు కౌంటర్స్‌లో ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కోసం ఐరీస్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, ఫిజికల్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసి, ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

దేశం నుంచి వెళ్లే సమయంలో వారు ఆటోమెటెడ్‌ క్లియర్స్‌ రూట్‌ను ఉపయోగించుకోవచ్చు. రెండో సారి వచ్చినప్పుడు వారు ఐరీస్‌, ప్రింగర్‌ప్రింట్స్‌ ఇచ్చి ఇమిగ్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇ-పాస్‌పోర్టులు జారీ చేయడం ప్రారంభమైన తరువాత బయోమెట్రిక్‌ ఇమ్మిగ్రేషన్‌ అమల్లోకి వస్తుందని సురేష్‌ ఖడక్‌భావ్‌ చెప్పారు. దీని వల్ల ప్యాసింజర్స్‌కు ఎంతో సమయం ఆదా అవుతుందని, వివిధ డాక్యుమెంట్లను వెంట తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలోకి 10.56 మిలియన్ల మంది విదేశీయులు వచ్చారు. 2022 నాటికి వీరి సంఖ్య 6.6 మిలియన్లుగా ఉంది. 2023 నవంబర్‌ నాటికి వీరి సంఖ్య 8.16 మిలియన్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement