జీవిత, జీవితేతర బీమా పాలసీలను అందించే అన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఇర్డాయ్) సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం బీమా సుగమ్ పేరుతో ఆన్‌లైన్ వేదికను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ వచ్చే ఏడాది జనవరి 1నుంచి అందుబాటులోకి వస్తుందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ వేదిక ద్వారా, బీమా పాలసీల కొనుగోలు, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు బదలీ చేసుకోవడం, బీమా ఏజెంట్లను మార్చుకోవడం, క్లెయింల పరిష్కారం వంటి అన్ని బీమా అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. పాలసీ కొనుగోలు దారులు ఈ వేదిక ద్వారా జీవిత, ఆరోగ్య, మోటారు బీమా పాలసీలను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా వెబ్ అగ్రిగేటర్లు, బ్రోకర్లు, బ్యాంకులు, బీమా ఏజెంట్లు మధ్యవర్తులుగా ఉంటూ అందించే అన్ని సేవలను సుగమ్ వేదిక ద్వారా ఈ-ఇన్సురెన్స్ ఖాతాతో పాలసీదారులు పొందవచ్చు. బీమా సుగమ్ ప్లాట్‌ఫారం సెంట్రలైజ్డ్ టెక్నాలజీ ఇన్‌ఎn్టాస్ట్రక్చర్‌తో వస్తుంది. అందువల్ల అన్ని పాnలసీలను సులభంగా నిర్వహించుకోవచ్‌చు. ఆన్‌లైన్‌లో పాలసీలను తేలిగ్గా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. ఆధార్ ద్వారా ధ్రువీకరణకు అనుమతిస్తే సరిపోతుంది.