Sunday, November 17, 2024

బిల్ నుంచి భరణాన్ని ఆశించడం లేదు: మిలిందా

బిల్ గేట్స్ మిలిందా విడాకుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనియాశమయింది. అయితే ఈ అంశంపై మిలిందా నేడు చేసిన ప్రకటన అందరినీ మరోమారు ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల విషయంలో తాము ఎలాంటి ముందస్తు ఒప్పందమూ చేసుకోలేదని పేర్కొన్న మిలిందా… అలాగే, ఆస్తుల పంపకం గురించి కూడా తమ మధ్య ఎలాంటి అంగీకారమూ కుదరలేదన్నారు…అంతేకాదు, బిల్ నుంచి తాను భరణాన్ని ఆశించడం లేదన్నారు. అలాగే, దాంపత్యపరమైన సాయాన్ని అర్థించబోనని తేల్చిచెప్పారు.

బిల్, మిలిందాలు ఇద్దరూ.. బిల్ అండ్ మిలిందా గేట్స్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు 53 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగించారు. తాము విడిపోయినప్పటికీ ఫౌండేషన్ కొనసాగుతుందని, దాని కోసం కలిసి పనిచేస్తామని బిల్, మిలిందాలు ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement