Tuesday, November 26, 2024

BharatGPT | ఏఐ రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీ..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , చాట్‌జీపీటీ ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం.. ఓపెన్ ఏఐతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బోట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి అడుగుపెట్టింది. చాట్ జీపీటీ తరహాలో భారత్ జీపీటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ కొసం రిలయన్స్ జియో, ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.

కంపెనీ డెవలప్ మెంట్ కోసం ఒక వ్యవస్థ రూపకల్పన చాలా ముఖ్యమని.. జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. దీంతోపాటు టెలివిజన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తేవడానికి విస్తృత స్థాయిలో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే దశాబ్దిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని తెలిపారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement