ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అత్యధిక నియామకాలతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. జులై-సెప్టెంబర్ మాసాల్లో దాదాపు 95 శాతం సంస్థలు నియామకాలు చేపట్టినట్లు ప్రముఖ హెచ్ఆర్ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఎంప్లాయిమెంట్ ఓట్లుక్ నివేదికను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 91 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ అనుబంధ రంగాల్లో వృద్ధివల్లే నియామకాలు జోరందుకున్నట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, 61శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపాయి. కిందటి త్రైమాసికం కంట ఇది 7 శాతం ఎక్కువ. బెంగళూరులో తయారీ, సేవల కంపెనీలు నియామకాలపై సానుకూలంగా ఉన్నాయి. తయారీరంగంలో ఎఫ్ఎంసీజీ 48 శాతం, ఆరోగ్య సంరక్షణ-ఔషధాలు 43శాతం, ఇంజనీరింగ్, మౌలిక వసతుల రంగంలో38శాతం, విద్యుత్-ఇంధనంలో 34 శాతం, వ్యవసాయ-ఆగ్రో కెమికల్స్‌లో 30 శాతం కంపెనీలు కొత్త నియామకాలుంటాయని పేర్కొన్నాయి. సేవా రంగంలో ఐటీ, ఈ-కామర్స్ రంగాలు ముందంజలో ఉన్నాయి. నగరాల వారీగా చూస్తే, తయారీరంగంలో ఢిల్లిd 72 శాతం, ముంబై 59 శాతం, చెన్నై 55 శాతం నియామకాలను ప్రకటించాయి. సేవారంగంలో ముంబై 81 శాతం, ఢిల్లిd 68 శాతం కంపెనీలు నియామకాలకు సానుకూలత వ్యక్తంచేశాయి.