Sunday, November 24, 2024

RBI | ఈ మంత్ ఎండ్ ఆదివారం.. అయిన బ్యాకులు తెరిచే ఉంటాయి..

ఈ నెల 31 (మార్చి)తో 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు ఈ నెల 31న యథావిధిగా పనిచేయాలని సూచించింది. అయితే, ఈ నెల 31 ఆదివారం వస్తోంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి.

ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం బ్యాంకులను తెరిచి ఉంచాలని ఆర్బీఐ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆదివారం యథావిధిగా పనిచేస్తాయి. ఆదాయపు పన్ను శాఖ కూడా కార్యాలయాలకు వారంతపు సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement