ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి గ్రామాల్లో 300 బ్రాంచ్‌లు ప్రారంభించనున్నాయి. ప్రధానంగా బ్యాంక్ బ్రాంచ్‌లు లేని గ్రామాల్లో వీటిని ప్రారంభించన్నాయి. ప్రధానంగా మూడు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వీటని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా రాజస్థాన్‌లో 95 బ్రాంచ్‌లు ఏర్పాటు కానున్నాయి. మధ్యప్రదేశ్‌లో 54 బ్రాంచ్‌లు, గుజరాత్‌లో 38, మహారాష్ట్రలో 33, ఝార్కండ్‌లో 32, ఉత్తర ప్రదేశ్‌లో 31 బ్యాంచ్‌లు ప్రారంభించనున్నారు.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శితో గత నెలలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల అధిపతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రా స్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సూచించిన ప్రాంతాల్లో ఈ కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 76 బ్రాంచ్‌లను, ఎస్‌బీఐ 60 బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. 2014, ఆగస్టు 28 నుంచి ఇప్పటి వరకు బ్యాంక్‌లు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై) పథకం కింద 46 కోట్ల బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించాయి. ఇందులో 1.74 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి.