న్యూఢిల్లి : పీఎస్‌యూ రుణ దాతల్లో అగ్రభాగంలో నిలుస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధి నమోదు చేసుకుంది. డిపాజిట్, రుణాల అందజేసే విభాగంలో.. ప్రభుత్వ రంగ రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్‌లో నిలబడింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డేటా ప్రకారం.. పుణే ప్రధాన కార్యాలయం కలిగిన రుణదాత మార్చి 2022 చివరి నాటికి గ్రాస్ అడ్వాన్స్‌లలో 26 శాతం పెరిగి.. రూ.1,35,240 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తరువాత.. 10.27 శాతం వృద్ధితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో, 9.66 శాతం వృద్ధితో బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. నాల్గో త్రైమాసికం ముగిసే సమయానికి మొత్తం అందజేసిన రుణ విలువ పరంగా చూసుకుంటే ఎస్‌బీఐ టాప్‌లో ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో పోల్చుకుంటే.. 18 రెట్లు ఎక్కువగా అంటే.. రూ.24,06,761 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో పోల్చుకుంటే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 రెట్లు ఎక్కువ అంటే.. రూ.6,99,269 కోట్లుగా రికార్డయ్యింది. ఇక డిపాజిట్ వృద్ధి చూసుకుంటే.. 2022 మార్చి ముగిసే సమయానికి డిపాజిట్లు 16.26 శాతం పెరిగి.. రూ.2,02,294 కోట్లుగా నమోదైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.
11.99 శాం పెరిగి.. రూ.10,32,102 కోట్లుగా ఉంది. ఇండియన్ బ్యాంక్ 10 శాతం పెరిగి.. రూ.5,84,661 కోట్లుగా రికార్డయ్యింది. బిజినెస్ పరంగా వృద్ధి చూసుకుంటే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 20 శాతం పెరిగి.. రూ.3,37,534 కోట్లుగా ఉంది. ఆ తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11.04 శాతం పెరిగి.. రూ.17,31,371 కోట్లుగా నమోదైంది. రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 18.65 శాతం వృద్ధి చెంది రూ.80,669 కోట్లుగా నమోదైంది. గ్రాస్ ఎన్‌పీఏ మార్చి 2021 నాటికి ఉన్న 7.23 శాతం కాస్త.. 3.94 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మార్చి 2021లో 2.48 శాతం నుంచి 0.97శాతానికి తగ్గాయి. మార్చి వరకు ఏడాది మొత్తానికి సంబంధించిన నికర లాభాలు చూసుకుంటే.. రెండు రెట్లు పెరిగి.. రూ.1152 కోట్లకు చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్లుగా నమోదైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..