Saturday, November 23, 2024

కొత్త సీజన్‌లో చక్కెర ఎగుమతులపై నిషేధం?

అక్టోబర్‌ 1 నుండి ప్రారంభమయ్యే రాబోయే చక్కెర సీజన్‌లో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా దేశీయ మార్కెట్‌కు సరఫరా మెరుగవుతుందని, ధరలను అదుపులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపాయి. ఈ నిషేధంపై బహుశా నవంబర్‌ మొదటి వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

2021-22లో, భారతదేశం రికార్డు స్థాయిలో 11 మిలియన్‌ టన్నుల చక్కెరను విక్రయించింది. అయితే 2022-23లో ఎగుమతులు దాదాపు 6 మిలియన్‌ టన్నులకు పరిమితం చేయబడ్డాయి. దేశీయంగా ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.

భారతదేశంలోని మొత్తం చక్కెర ఉత్పత్తిలో సగానికిపైగా వాటా కలిగిన మహారాష్ట్ర, కర్ణాటకలోని అత్యధికంగా చెరకు పండించే జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల చెరకు సాగుపై ప్రభావం పడింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, చక్కెర ధరలు ఒక నెల క్రితంతో పోలిస్తే సెప్టెంబర్‌ 28 నాటికి దాదాపు 2.5 శాతం పెరిగాయి. ఆగస్టులో చక్కెర వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 3.8 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement