చైనా ఫోన్లపై నిషేధం విధించనున్నట్లు వస్తున్న వార్తాల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ సంస్థలను కాపాడుకునేందుకు, దేశీ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12 వేల లోపు ధర ఉన్న చైనా ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
ఆరంభ ధరల మొబైల్ ఫోన్ల మార్కెట్లో పొరుగు దేశం కంపెనీలను నిషేధించే ఎటువంటి ప్రతిపాదన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో అమ్ముడు పోయే మొత్తం ఫోన్లలో 63శాతం రూ.12వేల లోపు ధరవే ఉంటున్నాయి.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.