దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో ఇటీవలనే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వెర్షన్ తీసుకువచ్చింది. ఈ ఈవీని ఆకర్షణీయమైన ధరతో.. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో లాంచ్ చేసింది కంపెనీ. బజాజ్ ఈవీ రెండు వేరియంట్ల (అర్బన్, ప్రీమియం) రూపంలో వస్తుంది. కాగా, ఈ ఈవీ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, సింపుల్ వన్, ఏథర్ 450ఎక్స్ వంటి మోడళ్లకు పోటీగా కంపెనీ కొత్త వెర్షన్ లాంచ్ చేసింది.
ధర, ఫీచర్లు !
కొత్త చేతక్ ఎలక్ట్రిక్ టూవీలర్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఇది అర్బన్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.35 లక్షలుగా ఉంది. ఈ ధరలు ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ). ప్రీమియం వేరియంట్‌లో టెక్‌ప్యాక్ వెర్షన్ ఉంటుంది. ఇందులో కనెక్టివిటీ ఫీచర్లు అదనంగా ఉంటాయి. కాల్ అలర్ట్, డిస్‌ప్లే థీమ్ కస్టమైజేషన్, మ్యూజిక్ కంట్రోల్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటివి పొందొచ్చు.
అలాగే అదనంగా హిల్ హోల్డ్, స్పోర్ట్ మోడ్, రివర్స్ మోడ్, 5 ఇంచుల టీఎఫ్‌టీ కలర్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త చేతక్ ఈవీలో కంపెనీ 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చింది. దీని టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 127 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే క్విక్ చార్జ్ ఫెసిలీ ఉంది. 30 నిమిషాలు చార్జ్ చేస్తే 15 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఇంకా ఫోన్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ఫీచర్లు కూడా మారతాయని గుర్తు పెట్టుకోవాలి. కాగా స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధరను మన ఏపీలో చూస్తే.. రూ.1.35 లక్షల వరకు పడుతుంది. ప్రీమియం వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే అర్బన్ వేరియంట్ అయితే రూ.1.15 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధర ఉంటుంది.