హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సాధారణ బీమా సంస్థల్లో ఒకటైన బజాజ్ అలియన్జ్
జనరల్ ఇన్సూరెన్స్ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1339 కోట్ల నికరలాభంతో గణనీయ ఆర్థిక లాభాలను నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో నమోదు చేసిన లాభాలు రూ.12,624కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 9.2శాతం పెరిగి రూ.13,788కోట్లకు చేరుకుంది. బజాజ్ అలియన్జ్ భారతదేశంలోనే అత్యంత లాభదాయకమైన సాధారణ బీమా సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. నివేదిక ప్రకారం ఆదారం 9.2శాతం పెరిగింది. దీనిప్రకారం నికరలాభం రూ.1339కోట్లుకు పెరగినట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ మేరకు బజాజ్ అలయన్స్ రాతపూర్వక ఆర్థిక నివేదికను ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..