Friday, November 22, 2024

బజాజ్‌ అలియాన్జ్‌ ఇన్సూరెన్స్‌ వృద్ధి 49.4 శాతం.. బిజినెస్‌ ప్రీమియంలో 49 శాతం వృద్ధి

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఒకటైన బజాజ్‌ అలియాన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌.. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 49.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. వ్యక్తిగత రేటింగ్‌ ఉన్న కొత్త వ్యాపారం (ఐఆర్‌ఎన్‌బీ) ప్రీమియంపై అద్భుతమైన వృద్ధిని కొనసాగించింది. కంపెనీ తన సమగ్ర ఉత్పత్తుల శ్రేణి, వినూత్న డిజిటల్‌ సేవలు, బలమైన విక్రయాల నెట్‌వర్క్‌ల నేపథ్యంలో మార్చి 2022 నెలలోనే అత్యధికంగా (టాప్‌ 10 ప్రైవేట్‌ ప్లేయర్స్‌లో) 39.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. బజాజ్‌ అలియాన్జ్‌ లైఫ్‌ ఎండీ అండ్‌ సీఈఓ తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రేటింగ్‌ పొందిన కొత్త బిజినెస్‌ ప్రీమియంలో 49 శాతం బలమైన వృద్ధిని సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది బిజినెస్‌ పారామీటర్స్‌ అంతటా ఏకీకృత ప్రయత్నాలకు ప్రతిబింబం అన్నారు. ఏదైనా దీర్ఘ కాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు తాము ప్రాధాన్యత ఇచ్చే భాగస్వామిగా ఉండాలనే పట్టుదలతో ముందుకువెళ్తున్నట్టు తెలిపారు. తాము ఆర్థిక సంవత్సరాన్ని బలమైన పోర్ట్‌పోలియోతో మాత్రమే కాకుండా.. సొంత ఏజెంట్లు, యాజమాన్య సేల్స్‌ ఫోర్స్‌తో సహా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ భాగస్వాములతో కూడిన బలమైన నెట్‌వర్క్‌తో సమానమైన బలమైన పంపిణీ నెట్‌వర్క్‌తో ముగించామన్నారు. ఐఆర్‌ఎన్‌బీ ప్రీమియంలో 49.4 శాతం పెరుగుదలతో.. బజాజ్‌ అలియాన్జ్‌ లైఫ్‌ వేగంగా వృద్ది చెందుతోంది. అయితే పరిశ్రమ 15.7 శాతం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ జీవిత బీమా సంస్థల వృద్ధి 21.9 శాతం వద్ద ఉంది. కంపెనీ రెగ్యులేటరీ ప్రీమియం సగటు టికెట్‌ సైజ్‌ కూడా రూ.77,634కు పెరిగింది. 2020-21లో రూ.57,782తో పోలిస్తే.. 34.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2020-21లో రూ.2468 కోట్లు ఉన్న ఐఆర్‌ఎన్‌బీ ప్రీమియం 2021-22లో రూ.3686 కోట్లకు పెరిగింది. 2020-21లో రూ.5712 కోట్లు ఉన్న రెన్యువల్‌ ప్రీమియం 22.4 శాతం వృద్ధితో 2021-22లో రూ.6,991 కోట్లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement