Friday, November 22, 2024

యాక్సిస్ మల్టిక్యాప్ ఫండ్.. ఇన్వెస్టర్లకు ఇదే బెస్ట్ అంటున్న కంపెనీ

ప్ర‌భ‌న్యూస్ : యాక్సిస్‌ మల్టిక్యాప్‌ ఫండ్‌ అనే నూతన ఫండ్‌ ఆఫర్‌ను ప్రకటించినట్టు భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఫండ్‌లలో ఒకటైన యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. ఈ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో నవంబర్‌ 26, 2021న ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 10, 2021న ముగుస్తుందని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. ఎన్‌ఎఫ్‌వో కనీస పెట్టుబడి రూ.5000గా ఉంది. ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌ అనుపమ్‌ తివారీ, డెట్‌ సెక్యూరిటీస్‌ మేనేజర్‌ సచిన్‌ జైన్‌ కొత్త ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. ఈ ఫండ్‌లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో అన్ని కేటగిరిలలో కనీస సమాన రిస్క్‌తో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. భారతీయ క్యాపిటల్‌ మార్కెట్లు అన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. గత ఐదేళ్లలో లార్జ్‌, మిడ్‌క్యాప్‌ కటాఫ్‌ దాదాపు రెట్టింపు అయ్యింది. మార్కెట్‌ ఒడిదుడుకుల్లో లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ రక్షణణిస్తాయి.

అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ జోరును కొనసాగించేందుకు తోడ్పడతాయి. యాక్సిస్‌ మల్టిక్యాప్‌ ఫండ్‌ అన్ని సెగ్మెంట్లలో మిశ్రమంగా పెట్టుబ డులు పెడుతుంది. స్థిరమైన, అవగాహనతో కూడిన కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్ల కు ఈ ఫండ్‌ సరిపోతుంది. తక్కువ అనిశ్చితితో దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలు సాధించాలనుకుంటున్న ఇన్వెస్ట ర్లకు ఉప యుక్తగా ఉంటుంది. మల్టిక్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ మితంగా ఉండాలనుకునేవారికి కూడా ఈ ఫండ్‌ అక్కరకొస్తుంది. కొత్త ఎన్‌ఎఫ్‌వో ప్రారంభం సందర్భంగా యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్‌ నిగమ్‌ స్పందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement