హైదరాబాద్, (ప్రభ న్యూస్) : అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) రెండు మిలియన్ల మంది వ్యక్తులకు శిక్షణనిస్తోంది. ఇండియాలో క్లడ్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడాన్ని కొనసాగిస్తోంది. ఈసందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఫిల్ డేవిస్ మాట్లాడుతూ…. ఇండియాలో రెండు మిలియన్ల మందికి పైగా ఏడబ్ల్యూఎస్ క్లడ్ నైపుణ్యాల శిక్షణను అందించినందుకు తాను గర్విస్తున్నాన న్నారు. భారతదేశంలో మెరుగైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించడం కొనసాగిస్తున్నందున మరింత కృషి చేయాల్సి ఉంటుందని తాము అంగీకరిస్తున్నామన్నారు. ఏడబ్ల్యూఎస్ లో ఆసియా పసిఫిక్, జపాన్ వాణిజ్య విక్రయాలు, వైవిధ్యమైన, సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని నిర్మించేందుకు ప్రభుత్వాలు, శిక్షణ ప్రదాతలు, యజమానులు మరింత అందుబాటులోఓ ఉండే, లక్ష్య నైపుణ్యాల శిక్షణను అందించేందుకు కలిసి పనిచేయాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..