క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాల వేలం ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశ వేలంలో 20 బ్లాక్‌లను వేలానికి పెడుతున్నారు. ఈ ఖనిజాలను వెలికితీయడం దేశ ఆర్ధిక వ్యవస్థకు, దేశ భద్రతకు ఎంతో కీలకమైనవని కేంద్రం తెలిపింది. ఆన్లైన్లో వేలం రెండు దశలుగా జరుగుతుంది. ఇది అరోహణ ఫార్వర్డ్ వేలం ప్రక్రియ ద్వారా దీన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి వేలం ప్రక్రియను ప్రారంభించనున్నట్లు గనుల శాఖ మంగళవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఎంఎస్టీసీ ఆక్షన్ ప్లాట్ఫామ్లో వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, వేలం నిబంధనలు, టైమ్‌లైన్ వంటివి లభిస్తాయని తెలిపింది. ఈ క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాలకు చాలా డిమాండ్ ఉందని తెలిపింది. రక్షణ, వ్యవసాయ రంగం, పునరుత్పాదక ఇంధన రంగంలో ఈ ఖనిజాల అవసరం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఖనిజాలను మన దేశీయ అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీటి నిల్వలను కొనుగొన్నారు.
వీటిని వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగం పాల్గేనేందుకు వీలుగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అత్యంత విలువైన ఈ ఖనిజాలను వెలికి తీసేందుకు గనుల తవ్వకాన్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయనుంది. ప్రస్తుతం వేలం వేయనున్న గనుల్లో అత్యంత కీలకమైన, అరుదైన లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. 2030 నాటికి విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 50 శాతం పెంచుకోవాలన్ని ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు ఈ ఖనిజాల అవసరం చాలా ఉంది.
సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్‌ను పెంచుకోవాల్సి ఉంది. మైనింగ్ చట్టంలో సవరణలు చేసిన తరువాత మొత్తం 24 ఖనిజాలను క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాలుగా కేంద్రం ప్రకటించింది. వీటిని వెలికి తీసేందుకు ప్రైవేట్ రంగాన్ని అనుమతి ఇస్తూ నిబంధనలకు ప్రభుత్వం సవరణ చేసింది. లిథియం నిల్వలు జమ్ము కాశ్మీర్‌తో పాటు, రాజస్థాన్‌లోనూ బయటపడ్డాయి. లిథియం విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైనది.