ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్యు4 ఫలితాలను వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే.. డిపాజిట్లు 46 శాతం పెరిగినట్టు వివరించింది. గతేడాది రూ.35,979 కోట్లు ఉంటే.. ఈ ఏడాది రూ.52,585 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. కాసా కూడా 23 శాతం నుంచి 37 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ఫండ్ ఆధారిత చెల్లింపులు గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.7421 కోట్లతో పోలిస్తే.. 39 శాతం పెరిగి.. రూ.10,295 కోట్లకు చేరుకున్నాయి. రూ.64 కోట్ల ఈసీఎల్‌జీఎస్ చెల్లింపులు జరిగాయి.
నాన్ ఫండ్ డిస్బర్స్‌మెంట్‌లు గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.391 కోట్లు ఉంటే.. 90 శాతం పెరిగి.. రూ.742 కోట్లకు చేరుకుంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ రూ.69,078 కోట్లతో 34 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం.. రూ.6915 కోట్లతో 21 శాతం వృద్ధి నమోదైంది. నికర లాభం మొత్తం ఏడాదికి సంబంధించి రూ.1,130 కోట్లుగా ఉండింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..