న్యూఢిల్లి : ఎథోస్ లిమిటెడ్ ఐపీఓగా వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు కీలక పత్రాలను సెబీకి సమర్పించింది. 18వ తేదీన ఐపీఓ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని కంపెనీ వివరించింది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.836 నుంచి రూ.878గా నిర్ణయించింది. ప్రతీ ఈక్విటీ షేర్‌పై ఫేస్ వ్యాల్యూ రూ.10గా ప్రకటించింది. 18వ తేదీ బుధవారం ప్రారంభమై.. 20వ తేదీ శుక్రవారంతో ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఒక లాట్‌లో 17 షేర్లు ఉంటాయి. చండీగడ్‌కు చెందిన ఎథోస్ లిమిటెడ్.. రూ.375 కోట్లను ఐపీఓ ద్వారా సేకరించాలని నిర్ణయించింది.
ఆఫర్ ఫర్ సేల్ కేటగిరిలో 11,08,037 షేర్లను అందుబాటులోకి ఉంచింది. ఎథోస్ అనేది.. ప్రీమియం, లగ్జరీ వాచీల విక్రయాలను జరుపుతుంది. ఒమేగా, ఐడబ్ల్యూసీ షాఫ్‌హౌసెస్, జైగర్ లెకౌల్ట్రే, పనేరై, హెచ్.మోజర్ అండ్ సీ, రాడో, లాంగిన్స్, బామ్, ఓమెర్సీ అండ్ ఎంఎస్‌ఏ వంటి 50 ప్రీమియం, లగ్జరీ వాచ్ బ్రాండ్‌లకు రిటైల్ చేస్తుంది. భారతదేశంలో లగ్జరీ వాచ్ రిటైల్ విభాగంలో 20 శాతం, ప్రీమియం, లగ్జరీ వాచీల రిటైల్ విభాగంలో 13 శాతం వాటా కలిగి ఉంది. ఎథోస్ బ్రాండ్ పేరుతో.. వాచ్ పరిశ్రమను.. కేడీడీఎల్ లిమిటెడ్ ద్వారా చండీగడ్‌లో జనవరి 2003లో లగ్జరీ రిటైల్ వాచ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇది గ్లోబల్ వాచ్ బ్రాండ్‌లతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకుంది. ఫలితంగా వ్యాపారం మరింత బలోపేతం అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి