హైదరాబాద్, (ప్రభ న్యూస్) : భారతదేశంలోని ఏ సిరామిక్ కంపెనీ ద్వారా ఎన్నడూ లేనంత పెద్ద రైట్స్ ఇష్యూ రూ. 441 కోట్ల విషయంలో విజయవంతమైనట్లు ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ (ఏజీఎల్) ప్రకటించింది. ప్రస్తుత క్లిష్ట సమయాల్లో కూడా.. వాటాదారులు, పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన ప్రతిస్పందనను అందుకుందన్నట్లు తెలిపింది. రైట్స్ ఇష్యూ పబ్లిక్ పోర్షన్ 6.87 కోట్ల షేర్లు లేదా రూ. 432 కోట్ల బిడ్లు అందుకుని, 1.38 రెట్లు పైగా సబ్ స్కైబ్ర్ అయింది. మొత్తం మీద, కంపెనీ 8.89 కోట్ల షేర్లు లేదా రూ.561 కోట్ల బిడ్లను రైట్స్ ఇష్యూలో ముగింపు తేదీ (మే 10) న స్వీకరించింది. నిజానికి కంపెనీ ఆఫర్ చేసినవి 6.99 కోట్ల షేర్లు లేదా రూ.441 కోట్లు- మాత్రమే. అంటే, 127శాతం కంటే ఎక్కువ సబ్ స్కిప్ష్రన్ వచ్చినట్లయింది. ఈక్విటీ షేర్ల కేటాయింపు సుమారుగా 2022 మే 19న జరుగుతుంది. రైట్స్ షేర్లను సుమారుగా 2022 మే 24 ప్రాంతాల్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయాలని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..