Thursday, November 21, 2024

HYD | అరవిందరావు, మాళవిక, పురాణపండ ఆకర్షణగా కార్తీక వనసమారాధన

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ కార్తీక మాసంలోనూ కమ్మ సంఘాలు, రెడ్డిసంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, వైశ్యసంఘాలు, వెలమ సంఘాలు, గౌడ సంఘాలు, బీసీ సంఘాలు.. ఇలా అనేక కులాల పేరిట అనేక పేర్లతో ఉన్న కులసంఘాలు కార్తీకమాసంలో వన భోజనాల పేరిట కార్తీక సమారాధనలు ఏర్పాటు- చేస్తూంటాయి. ఎక్కడెక్కడి వారో ఒక్కటై ఒక ప్రాంతంలో కలిసి ఎంతో ఆనందంగా ఈ కార్తీక వన భోజనాల్ని అనేక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జరుపుకోవడం దశాబ్దాలుగా తెలుగునాట జరుగుతున్న ఆచారం. ఈ కోణంలోంచి చూసినప్పుడు సుమారు పది సంవత్సరాలుగా సుమారు ముప్ఫైమంది ఆరామద్రావిడ శాఖకు చెందిన బ్రాహ్మణులు ఐకమత్యంగా నిర్వహిస్తూన్న ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్‌ సొసైటీ సంస్థ ఇప్పుడు సుమారు వెయ్యికి పైగా కుటుంబాల సభ్యత్వంతో అప్రతిహతంగా సాగుతోంది.

- Advertisement -

ఈ సుముహూర్తాన సీనియర్‌ పాత్రికేయులు వేదుల సూర్యనారాయణమూర్తి ఈ సంస్థను స్థాపించారో గానీ ఇప్పుడు, అనగా ఈ సంవత్సరం ప్రముఖ సైన్‌ నిర్మాత వివేక్‌ కూచిభట్ల అధ్యక్షునిగా వ్యవహరించడం పట్ల అనేక బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీ-వల ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో వివేక్‌ కూచిభట్ల సారథ్యంలో సొసైటీ పాలకవర్గమంతా ఒక్కటై శ్రమించి, నాటి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కరణం రామచంద్రరావుని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి బ్రహ్మతేజస్సు అనే డైరీని ఆవిష్కరించిపచేసి, పూర్వ డీజీపీ అరవిందరావు సంప్రదాయ ప్రసంగంతో పాటు అభినందనలు అందుకోవడం విశేషం.

ప్రముఖ సినీ నేపథ్యగాయని మాళవిక కుటు-ంబ సమేతంగా ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకుల సత్కారాన్ని అందుకోవడం, ప్రేక్షకుల కోరికపై అద్భుతమైన పాటలు పాడటం ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించిందనడంలో సందేహం లేదు. వివిధ కళా సాహిత్యరంగాలకు చెందిన నిష్ణాతులు ఓలేటి శ్రీనివాస భాను, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, ఆకొండి శ్రీనివాస రాజారావు, భళ్ళమూడి శ్రీరామశంకర ప్రసాద్‌ తదితర ఆరామ ద్రావిడ ప్రముఖులను నిర్వాహకులు సత్కరించడం సంప్రదాయ సంస్కృతీ విలువలకు పట్టం కట్టినట్లు నిరూపించారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఉపాధ్యక్షుడు వేదుల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కొల్లూరి సూర్యారావు, పాలకవర్గమైన ఏవీఎస్‌ఎన్‌.మూర్తి, చెళ్లపిళ్ల సుబ్రహ్మణ్యం, ఆకుండి సూర్య, మహేంద్రవాడ మూర్తి, తాతపూడి సత్యభద్రకీర్తి, సీహెచ్‌.గణనాథ్‌, అల్లంరాజు శ్రీకాంత్‌, పొదిలి సతీష్‌, ద్విభాషి వెంకట్రావు. ఈ కార్యక్రమానికి అన్నివిధాలా సహకరించి విజయవంతంగా ముందుకు నడిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కూచిభట్ల సూర్యకాంతి ఉత్సాహవంతంగా అందరినీ పలకరించడం, వ్యాఖ్యాత డీ.ఉష చక్కటి వాచికం బ్రాహ్మణ రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సామాన్యంగా కుల సంఘాలకు దూరంగా ఉండే, ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహా దారు పురాణపండ శ్రీనివాస్‌, ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యఅతిథిగా హాజరవ్వడం ఆశ్చర్యం కలిగించింది.

ఏ సభకి వెళ్లినా శ్రీనివాస్‌ సూటిగా స్పష్టంగా ఉంటారని అందరికీ తెలుసున్న అంశమే. నిస్వార్థ ధార్మిక సేవకునిగా, ప్రముఖ రచయితగా వేలమంది అభిమానులున్న పురాణపండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ… మహత్కార్యాలకు అడ్డు వచ్చేవారిని పట్టించుకోకూడదని, బ్రాహ్మణ సమాజానికి అసూయలు, ద్వేషాలు ఉండకూడదని తనదైన అద్భుత భాషా సంస్కారంతో ప్రసంగిస్తుండగా అక్కడున్న బ్రాహ్మణ పరివారమంతా చప్పట్లు కొట్టి ఉత్సాహపరచడం విశేషం. ఇలాంటి బ్రాహ్మణ కలయికల వల్ల బలాలు మహాబలాలై బంధుత్వాలు బలపడి ఆనందాలు వెల్లివిరుస్తాయని పేర్కొంటూ వివేక్‌ కూచిభట్ల, వేదుల సుదర్శన్‌, ఆకుండి సూర్య, చెళ్ళపిళ్ళ సుబ్రహ్మణ్యంల కారణంగా తానీ ఉత్సాహవంతమైన ఉత్సవానికి హాజరైనట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమమంతా ఆట పాటలు, ఉల్లాసభరితమైన అంశాలతో అద్భుతంగా సాగడం ఒక అందమైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నట్లు పాలకవర్గం సంతోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement