Monday, November 18, 2024

ఏప్రిల్‌లో బ్యాంకుల హాలీడేస్ వివరాలు

ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే అలర్టుగా ఉండండి. ఎందుకంటే ఆర్‌బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఏఏ రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం అవసరం.

ఏప్రిల్ నెలలో పండుగలు, ఇతర సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 1న ఏడాది ఖాతాల క్లోజింగ్ (బ్యాంకులు తెరిచి ఉన్నా లావాదేవీలు ఉండవు), 2-గుడ్ ఫ్రైడే, 4-ఆదివారం, 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 10- రెండో శనివారం, 11 ఆదివారం, 13- ఉగాది, 14- అంబేద్కర్ జయంతి, 18- ఆదివారం, 21- శ్రీరామనవమి, 24- నాలుగో శనివారం, 25- ఆదివారం. ఇవన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సెలవులు. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకుంటే మంచిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement