తాము కాలుమోపిన రంగాల్లో దిగ్గజ శక్తులుగా ఎదిగిన యాపిల్, గూగుల్ ప్రస్తుతం డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ మార్కెట్ లీడర్‌గా గూగుల్ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుండగా ఈ స్పేస్‌లో అడుగుపెట్టి సెర్చ్ ఇంజన్ దిగ్గజాన్ని ఢీ కొట్టాలని యాపిల్ యోచిస్తోంది. సొంత సెర్చ్ఇంజన్‌ను లాంఛ్ చేసేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేపట్టింది. 2023 జనవరి నాటికి సెర్చ్ ఇంజన్ పనిచేసేలా యాపిల్ ప్రణాళికలు రూపొందిస్తోందని టెక్ వర్గాలనుంచి వార్తలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.