Sunday, October 20, 2024

Apple | శాంసంగ్‌కు షాక్‌ ఇచ్చిన యాపిల్‌..

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌కు యాపిల్‌ షాక్‌ ఇచ్చింది. ప్రపంచ స్మార్ట్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ శాంసంగ్‌ను యాపిల్‌ వెనక్కి నెట్టింది. 12 సంవత్సరాలుగా శాంసంగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అత్యధిక స్మార్ట్‌ ఫోన్లు సరఫరా చేసిన కంపెనీగా తొలిసారి యాపిల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2023కు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) సంబంధించిన గణాంకాలు వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ సరఫరా విషయంలో శాంసంగ్‌ 2010 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలిసారి యాపిల్‌ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో మొత్తం 235 మిలియన్‌ యూనిట్లను యాపిల్‌ సరఫరా చేసినట్లు ఐడీసీ తెలిపింది. ప్రపంచ స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో ఐదో వంతు ఫోన్లను యాపిల్‌ సరఫరా చేసినట్లు ఐడీసీ పేర్కొంది. ఈదే సమయంలో శాంసంగ్‌ 226.5 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేసింది.

19.4 శాతం వాటాతో శాంసంగ్‌ రెండో స్థానంలో నిలిచింది. శాంసంగ్‌ తరువాత షావోమీ, ఒప్పో వంటి కంపెనీలు తదుపరి స్థానాన్లో ఉన్నాయి. కొత్త మోడళ్లను విడుదల చేసినప్పుడు పాత ఫోన్లపై ఆఫర్లు ప్రకటించడం, వడ్డీ లేని రుణాలు, ప్రీమియండివైజులకు డిమాండ్‌ పెరగడం వంటివి యాపిల్‌ విజయం సాధించేందుకు కారణాలుగా ఐడీసీ పేర్కొంది.

- Advertisement -

యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో ప్రభుత్వ ఆంక్షలు, ఆ దేశ కంపెనీ అయిన హువావే నుంచి గట్టిపోటీని తట్టుకుని యాపిల్‌ ఈ లక్ష్యం సాధించిందని ఐడీసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నబిలా పోవాల్‌ చెప్పారు. అండ్రాయిడ్‌ ఫోన్లు తయారు చేసే శాంసంగ్‌ షావోమీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. 2023లో 1.2 బిలియన్‌ స్మార్ట్‌ ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యాయి. అంతుకు ముందు సంవత్సరంతో పోల్చితే 3 శాతం అమ్మకాలు తగ్గాయి. అండ్రాయిడ్‌ సెగ్మెంట్‌లో పోటీ పెరగడం, ఫోల్టబుల్‌ ఫోన్లు, ఏఐపై కస్టమర్లకు ఆసక్తి పెరగడంతో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ ఆసక్తిగా మారిందిని ఐడీసీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement