Tuesday, November 26, 2024

100 మంది రిక్రూటర్లను తొలగించిన యాపిల్‌

అమెరికాలో వరసగా టెక్నాలజీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యలు చేపడుతున్నాయి. కొన్ని కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త నియామకాలను నిలిపివేస్తున్నాయి. ఆర్థిక మాంధ్యం తప్పదన్న అంచనాతో కంపెనీలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌ 100 మంది కాంట్రాక్ట్‌ రిక్రూటర్లను విధుల నుంచి తొలగించింది. యాపిల్‌ కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గించింది. దీంతో రిక్రూటర్ల అవసరం తగ్గిందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. తొలగించిన వారికి రెండు వారాల వేతనంతో పాటు, వైద్యపరమైన ప్రయోజనాలు అందుతాయని తెలిపింది. పూర్తికాలపు రిక్రూటర్లు మాత్రం కొనసాగుతారని పేర్కొంది.

కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆయన గత నెలలోనే ప్రకటించారు. మరోవైపు గూగుల్‌ కూడా తన ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోకుంటే తొలగింపు తప్పదని హెచ్చరించింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకుంటే ఉద్యోగులను తొలగించకతప్పదని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ హెచ్చరించారు. ఫేస్‌బుక్‌ మాతృ సంస్త మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ కూడా తమ సంస్థ సిబ్బందిని పనితీరుపై హెచ్చరించారు. పనితీరు సరిగాలేని వారిని తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. ట్విట్టర్‌ కూడా కొంత కాలంగా ఉద్యోగ నియామకాలను నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement