Thursday, September 19, 2024

Apple ఐఫోన్ 16 సిరీస్‌ వచ్చేసింది…

ప్రముఖ టెక్‌ సంస్థ ‘యాపిల్‌’.. ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్లను లాంచ్ చేసింది. సోమవారం అర్ధరాత్రి యాపిల్‌ పార్క్‌లోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ‘గ్లోటైమ్‌’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్‌ రిలీజ్ అయింది.

ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్లలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌, ఏ18 చిప్‌ను యాపిల్‌ కంపెనీ పరిచయం చేసింది.

- Advertisement -

ఐఫోన్ 16 మరియు ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఏ18 చిప్‌ను ఇచ్చారు. ఈ చిప్ రెండు రెట్లు వేగవంతమైన న్యూరల్ ఇంజిన్‌, 17 శాతం ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌తో అప్‌గ్రేడ్ చేసిన మెమరీ సబ్‌సిస్టమ్‌ను కలిగి ఉంది. దాంతో ఐఫోన్ 15 కంటే 30 శాతం వేగవంతమైన పనితీరు ఉంటుంది.

.ఐఫోన్ 16 వనిల్లా వేరియంట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 16లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది . ప్రధాన కెమెరా 48 ఎంపీ. అలాగే 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ను ఇచ్చారు . 2x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఐఫోన్ 16 మాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. దీనితో మీరు స్పేషియల్ వీడియోని క్యాప్చర్ చేయగలుగుతారు.

ఐఫోన్ 16 ధర 799 డాలర్లు (రూ.67,084) కాగా.. ఐఫోన్ 16 ప్లస్ ధర 899 డాలర్లుగా (రూ.75,480) ఉంది. ఈ రెండు మోడల్స్ 128 జీబీ బేస్ మోడల్‌ను కలిగి ఉన్నాయి.

.ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర 999 (రూ.83,876) డాలర్లుగా ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రారంభ ధర 1199 యూఎస్ డాలర్లు (రూ.1,00,668). 16 ప్రో 128 జీబీ బేస్ మోడల్‌లో వస్తుంది. అయితే 16 ప్రో మాక్స్ బేస్ మోడల్‌లో 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

అయితే భారత్‌లో ఈ ధర ఎక్కువగా ఉంటుంది. దిగుమతి సుంకాలు, అదనపు ఖర్చుల కారణంగా భారతీయ కొనుగోలుదారులు అధిక ధర పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement