Saturday, November 16, 2024

భారతీయ మార్కెట్‌లో ఆరవ స్థానంలోకి యాపిల్‌..

భారతదేశ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో 6శాతం వృద్ధితో 46 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) వరల్డ్‌వైడ్‌ క్వార్టర్లీ మొబైల్‌ ఫోన్‌ ట్రాకర్‌ ప్రకారం, యాపిల్‌ కంపెనీ 4మిలియన్‌ యూనిట్లను ఎగుమి చేసింది.

తద్వారా దేశంలో అతిపెద్ద త్రైమాసిక వృద్ధిని నమోదుచేసింది. యాపిల్‌ వృద్ధి 2023 క్యూ3లో 5.7 శాతం నుండి క్యూ3 2024లో 8.6 శాతానికి పెరిగింది. యూనిట్ల వృద్ధి వార్షిక ప్రాతిపదికన 58.5 శాతం పెరిగింది. ఐడీసీ ప్రకారం, యాపిల్‌ షిప్‌మెంట్‌లలో ఐఫోన్‌15, ఐఫోన్‌ 13 ముందున్నాయి.

అదే సమయంలో, వన్‌ ప్లస్‌ మార్కెట్‌ వాటాను భారీగా కోల్పోయింది. టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ల విషయానికొస్తే, వివో 15.8 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానాన్ని కలిగి ఉంది. తర్వాతి స్థానాల్లో ఒప్పో (13.9శాతం), శాంసంగ్‌ (12.3శాతం), రియల్‌మి (11.5శాతం), జియామి (11.4శాతం) మార్కెట్‌షేర్‌తో ఉన్నాయి. 2024 క్యూ3లో 8.6 శాతం మార్కెట్‌ షేర్‌తో యాపిల్‌ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత పోకో, మోటరోలా, ఐక్యూ, వన్‌ప్లస్‌ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement