ఆపిల్ దీపావళి సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పోడ్స్ వంటి అనేక ఇతర ప్రొడక్ట్ లపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్ ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. మరి సేల్ లో ఐఫోన్ లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం..
యాపిల్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు
యాపిల్ దీపావళి సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రత్యేక ఆఫర్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 6,000 తగ్గింపు లభించనుంది. మరోవైపు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లపై రూ. 5,000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేస్తే రూ. 4,000 తగ్గనుంది.
13 అంగుళాలు, 15 అంగుళాల మాక్‌బుక్ ఎయిర్ ఎం2, 13 అంగుళాలు, 14 అంగుళాలు, 16 అంగుళాల మాక్‌బుక్ ప్రో, మాక్ స్టూడియో మోడల్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 తగ్గింపు లభించనుంది. యాపిల్ కస్టమర్లు మూడు నుంచి ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందుతారు. ఇది కాకుండా యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కాడ్‌లకు సంబంధించి మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో..
యాపిల్ కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారు ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ ద్వారా వారి ప్రస్తుత డివైస్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయవచ్చు. దీని ద్వారా వారు కొనాలనుకునే ఐఫోన్ ధర మరింత తగ్గుతుంది. ట్రేడ్-ఇన్ క్రెడిట్ వాల్యూ డివైస్‌ను బట్టి మారుతూ ఉంటుంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ రూ. 67,800 వరకు ఉంది. అయితే ఐఫోన్ 13 ట్రేడ్ ఇన్ విలువ రూ. 38,200 వరకు ఉంది.
యాపిల్ హోంపోడ్, ఎయిర్‌పోడ్స్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల మూడు, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే వీటి కొనుగోలుపై ఆరు నెలల యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 15 సిరీస్ 2023 సెప్టెంబర్‌లోనే మనదేశంలో లాంచ్ అయింది. వీటి ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు రూ.1,34,900 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈసారి అన్ని ఐఫోన్లలోనూ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ కూడా ఉంది.