దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ అయిన విజయ్ సేల్స్.. ఆపిల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. విజయ్ సేల్స్ కంపెనీ ‘‘ఆపిల్ డేస్ సేల్’’ పేరుతో ఒక సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ తో పాటు ఐప్యాడ్స్ వంటి ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది.
ఇక ఈ సేల్ ఆగష్టు 10 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్ ఆఫర్స్ ని దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 125 విజయ్ సేల్స్ అవుట్ లెట్స్ / విజయ్ సేల్స్ ఆన్ లైన్ ప్లాట్ ఫారం ద్వారా పొందవచ్చు. అలాగే.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా నచ్చిన ఆపిల్ ప్రొడక్ట్ ఏదైన కొనుగోలు చేసినట్లయితే, అదనపు డిస్కౌంట్ లను కూడా పొందవచ్చు. వీటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా ఉన్నాయి.
ఆపిల్ ప్రొడక్ట్ లు.. ఆఫర్లు :
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 14 రూ.79,999 లుగా ఉంది. అయితే.. ఈ విజయ్ సేల్స్ స్పెషల్ ఆఫర్ లో ఇదే ఐఫోన్ 14 రూ.69,990 కే అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ధర ఆపిల్ అధికారిక వెబ్ సైట్ లో రూ.89,990 లుగా ఉంది. ఒకవేళ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే.. అదనంగా మరో రూ.4000 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అలాగే పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, అదనంగా రూ. 8000 డిస్కౌంట్ ను పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
ఇక విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ లో ఐఫోన్ 14 ధర రూ.1,17,990 లుగాను, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,25,099 లుగా ఉంది. ఒకవేళ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే.. అదనంగా మరో రూ.4000 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
మ్యాక్‌బుక్
M1 చిప్‌తో వస్తోన్న ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ రూ 75,900 వద్ద అందుబాటులో ఉంది. అలాగే, M2 చిప్‌తో వస్తోన్న ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ రూ.1,01,990గా.. మాక్‌బుక్ ప్రో రూ 1,11,900 నుండి ప్రారంభమవుతుంది. ఇక, M2 ప్రో చిప్‌తో వస్తోన్న మ్యాక్‌బుక్ ప్రో ధర.1,78,990 గా ఉంది. ఒకవేళ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే.. అదనంగా మరో రూ.5000 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
ఐప్యాడ్
ఆపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్ ధర రూ.25,990 గాను, అలాగే ఐప్యాడ్ 10వ జనరేషన్ బేస్ వేరియంట్ ధర రూ. 38,990 లుగా, అదే విధంగా ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ బేస్ వేరియంట్ ధర రూ. 51,900 లుగా ఉంది. ఒకవేళ మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా మరో రూ. 3000 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.