Friday, November 22, 2024

హైదరాబాద్‌లో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ..

హైదరాబాద్‌ : యాపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌లో ఎయిర్‌ పాడ్స్‌ను తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. యాపిల్‌ కంపెనీ తన ఐఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నది. ఫాక్స్‌కాన్‌ హైదరాబాద్‌ ప్లాంట్‌ కోసం మొత్తం 550 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. తొలుత ఈ ప్లాంట్‌లో 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న ప్రకటించిన కంపెనీ, ఇటీవల ఇందుకు అదనంగా మరో 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది.

2024 డిసెంబర్‌ నుంచి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఇయిర్‌ పాడ్స్‌ను ఉత్పత్తి చేస్తుందని ఆ ప్రతినిధి వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఇయర్‌ పాడ్స్‌ తయారీకి యాపిల్‌ కంపెనీ ఆమోదం తెలిపిందని ఫాక్స్‌కాన్‌ భారత ప్రతినిధి వి లీ తెలిపారు. 400 మిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడికి కూడా యాపిల్‌ కంపెనీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. 2022 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో (టిడబ్ల్యూఎస్‌) ఇయర్‌ బడ్స్‌ విభాగంలో యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌వాటా 36 శాతంగా ఉంది. దీని తరువాత శామ్‌సంగ్‌కు 7.6 శాతం, షావోబి 4.4 శాతం, బోట్‌ కంపెనీకి 4 శాతం, ఒప్పోకు మూడు శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి.

షావోమి కూడా ఈ సంవత్సరం నుంచే భారత్‌లోని నోయిడాలో ఉన్న ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌లో టీడబ్ల్యూఎస్‌ల తయారీని ప్రారంభించింది. భారత్‌లో ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌ కార్పొరేషన్‌, విస్ట్రన్‌ కొర్పోరేషన్‌లు ఐఫోన్‌ 11 నుంచి 14 వరకు వివిధ రకాల మోడళ్లను తయారు చేస్తున్నాయి. ఈ మూడు కంపెనీల ద్వారా దేశంలో 65 వేల మందికి ఉపాధి లభిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement