Thursday, November 21, 2024

రియల్ టైం క్రాప్‌లో ఏపీకి అగ్రస్థానం.. రాష్ట్రంలో పకడ్బందీగా ఈ-క్రాప్‌ నమోదు

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్‌ టైం క్రాప్‌ మేనేజ్‌ మెంటు-లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణలో ఈ-క్రాప్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయటం ద్వారానే సర్వే నెంబర్ల వారీగా సాగవుతున్న పంటల వివరాలు, విస్తీర్ణం కూడా రియల్‌ టైం క్రాప్‌ మేనేజ్‌మెంట్‌ లో నమోదయిందని అధికారులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్ళుగా ఈ-క్రాప్‌ నమోదులో నిర్దిష్టమైన విధానాలు అవలంబిస్తూ రైతుల్లో అవగాహన పెంచటం ద్వారానే ఇది సాధ్యమైంది..ఏపీలో ఈ-క్రాప్‌ విధానాలనే అనుసరిస్తూ దేశవ్యాప్తంగా అగ్రిస్టాక్‌ డిజిటల్‌ కేంద్రాలు ఏర్పాటు- చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ-క్రాప్‌ నమోదు చేసిన రైతుతందరికీ ఈ-కేవైసీ నమోదును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..మీ పంట మీరు తెలుసుకోండి అనే పేరుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమాతో పాటు రైతుకందించే అన్ని సబ్సిడీలు, రాయితీలు, సంక్షేమ పథకాలన్నిటికీ ప్రామాణికంగా ఉండటంతో ఈ-క్రాప్‌ కు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement