హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలంపై సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 11న నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 14న వేలం వేయాలని సర్కార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. నిధుల సమీకరణలో భాగంగా ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో రాజీవ్ స్వగృహకు చెందిన ప్లాట్లు, ఖాళీ స్థలాలతోపాటు ఇతర ఆస్తుల విక్రయానికి ప్రభుత్వం సుముఖత తెలిపింది. 10 జిల్లాల్లో 19 ఆస్తులను వేలం వేసి భారీగా రాబడిని సమీకరించుకోవాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌గా లుకింగ్ ఆఫ్టర్ అర్జెంట్ బాధ్యతల్లో ఉన్న ఇంచార్జీ సీఎస్‌గా ఉన్న అర్వింద్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ప్రభుత్వ భూములు, ఆస్తుల వేలంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. హౌజింగ్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్‌శర్మ, 10 జిల్లాల కలెక్టర్లు, లోకల్‌బాడీల అదనపు కలెక్టర్లు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈదఫా వేలంలో బౌతిక పద్దతితోపాటు, ఈ ఆక్షన్‌ను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల్లో బౌతిక వేలంద్వారా, హైదరాబాద్‌లోని ఆస్తులను ఈ వేలంలో విక్రయించాలని నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీలు ఈ యాక్షన్‌ను నిర్వహించనున్నాయి. జిల్లాల్లో బౌతిక పద్దతిలో ఆస్తుల విక్రయాలను కలెక్టర్లు పర్యవేక్షణ చేయనున్నారు. పారదర్శకంగా వేలం ప్రక్రియకు టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏలు ప్రభుత్వ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. తొర్రూరు, తుర్కయాంజాల్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, అమిస్తాన్‌పూర్‌లలో హెచ్‌ఎండీఏ, చందానగర్, కవాడిపల్లిలలో టీఎస్‌ఐఐసీలు ఈ వేలం నిర్వహిస్తాయి.
మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో చదరపు అడుగుకు రూ. 8వేల కనీస ధరను, మహబూబ్‌నగర్‌లో మరోసైట్‌లో రూ. 15వేల కనీస ధరను, కామారెడ్డి, నల్గొండలలో రూ. 7వేల కనీస ధరను, వికారాబాద్‌లో ఎకరాకు రూ. 59లక్షలు, ఖమ్మంలో ఎకరాకు రూ. 3కోట్లు, తుర్కయాంజాల్‌లో చదరపు అడుగుకు రూ. 40వేలు, చందానగర్‌లో రూ. 40వేలను, కవాడిపల్లిలో చదరపు అడుగుకు రూ. 10వేలను కనీస ధరగా నిర్ణయించారు. నోటిఫికేషన్లో పూర్తి వివరాలను ఈఎండీ వివరాలను వెల్లడించనున్నారు.
ఇండ్లే కాదు భూములూ ఉన్నాయి…
డ్లతో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు రాష్ట్రంలో విలువైన భూములు కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం సమస్యగా మారడంతో విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కార్పొరేషన్‌కు ఉన్న 3337 ఎకరాలను విక్రయించిభారీగా నిధులను సమీకరించుకునేందుకు ఉన్న మార్గాను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్, ఖమ్మం, కామారెడ్డి నల్గొండలలో 8047 ప్లాట్లు, 416 ఇండ్లు ఉండగా, ఇతర ప్రాంతాల్లో 685ఫ్లాట్లు, 536 ఎకరాల భూములున్నాయి.
జిల్లా – ఎకరాలు
రంగారెడ్డి – 631
నల్గొండ – 75
వరంగల్ – 52
మహబూబ్‌నగర్ – 39
మెదక్ – 32
నిజామాబాద్ – 12
ఆదిలాబాద్ – 10
కరీంగనగర్ – 6
హైదరాబాద్ – 6
ఖమ్మం – 2