Monday, November 25, 2024

పాలసీల పునరుద్ధరణకు మరో అవసకాశం

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పాలసీదారులు లాప్స్‌ అయిన వాటిని పునరుద్ధరించేకునే అవకాశం కల్పించింది. ఎల్‌ఐసీ పాలసీల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రీమియం చెల్లింపుల గడువు దాటి, కాలవ్యవధి పూర్తికాని పాలసీలను ఈ కార్యక్రమంలో పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు ఇది అమల్లో ఉంటుంది. ప్రీమియం నిలిచిపోయి 5 సంవత్సరాలు, అంతకంటే తక్కువ కాలవ్యవధి ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరిస్తారు.

ఆలస్య రుసుం విషయంలోనూ రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. లక్ష రూపాయిల వరకు ప్రీమియం ఉన్న పాలసీలపై 25 శాతం, గరిష్టంగా 2,500 రూపాయిలు రాయితీ ఉంటుంది. లక్ష నుంచి 3 లక్షల వరకు ఉన్న పాలసీలపై 25 శాతం, గరిష్టంగా 3 వేల వరకు రాయితీ లభిస్తుంది. 3 లక్షలకుపైగా ఉన్న పాలసీలపై 30 శాతం, గరిష్టంగా 3,500 వరకు రాయితీ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు గడువు తీరిని పాలసీలను ఈ కార్యక్రమంలో పునరుద్ధరించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement