ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్‌లో మరో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఎస్ 1 ఎయిర్ పేరుతో ఓలా కొత్త ధరలో స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఇప్పటికే ఎస్1, ఎస్1 ప్రో పేరుతో రెండు విద్యుత్ స్కూటర్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. కొత్త ఎస్1 ఎయిర్ ధరను కంపెనీ 79 వేలుగా నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్ కింద 2023 మే 24 వరకు ఇదే ధర ఉంటుందని కంపెనీ తెలిపింది. తరువాత ఈ స్కూటర్ ధరను 85 వేలుగా ఓలా ప్రకటించింది. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లకు పోటీగా ఓలా ఈ కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. కొత్త ఎస్1 ఎయిర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 101 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటలకు 90 కిలోమీటర్లు. 4.3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ప్రస్తుతం ఉన్న ఓలా స్కూటర్ల మాదిరిగానే సీటు కింద 34 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ డాష్‌బోర్డులో 17.78 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై, జీపీఎస్ వంటి సదుపాయలు ఉన్నాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. కొత్త స్కూటర్ 5 రంగుల్లో లభిస్తుంది. బ్యాటరీని 4.30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఓలా ఎస్1 ఎయిర్‌ను ఓలా వెబ్‌సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫ్రిబవరి 1 నుంచి కొనుగోలుకు అవకావం కల్పించారు. ఏప్రిల్ నెలలో కొత్త స్కూటర్ల డెలివరీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 999 రూపాయిలతో ఓలా ఎస్1 ఎయిర్‌ను బుక్ చేసుకోవచ్చు.