వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్‌లో ఛానెల్ రిపోర్ట్ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు ఛానెల్స్‌కు ఎన్ని రిపోర్ట్లు వచ్చాయి? వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు సమాచారాన్ని కూడా పొందవచ్చు. వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 2.24.3.31 అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఆండ్రాయిడ్ లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడి వైపున పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లో కిందకి స్క్రోల్ చేసి హెల్ప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ యూజర్లకు ఛానెల్ రిపోర్ట్స్ అనే కొత్త ఆప్షన్‌ను కనిపిస్తుంది. ఈ కొత్త ఆప్షన్‌ను క్లిక్ చేసిన తర్వాత వినియోగదారులు ఏ ఛానెల్స్‌ను రిపోర్ట్ చేశారు. వాటిపై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుందో చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఈ ఫీచర్‌ని బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.