Tuesday, November 19, 2024

KIA EV9 | కియా నుంచి మరో ఈవీ.. భారత్‌ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి

దక్షిణ కొరియాకు చెందిన కియా భారత్‌ మార్కెట్‌లో వచ్చే సంవత్సరం ఈవీ9 పేరుతో మరో విద్యుత్‌ కారును మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ కారు ఉత్పత్తిని 2025 నుంచి ప్రారంభించనుంది. కంపెనీ వరసగా విద్యుత్‌ కార్లను తీసుకు వస్తుందని కియా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ తే-జిన్‌ పార్క్ తెలిపారు. దేశ విద్యుత్‌ కార్ల మార్కెట్‌లో 2030 నాటికి 15-17 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

అమెరికా, యూరోప్‌, దక్షిణ కొరియా మార్కెట్లకు భారత్‌ మార్కెట్లు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో ఉత్పత్తి ప్రోత్సహకాలు ఉన్నాయని, వీటి మూలంగా కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. భారత్‌లో విద్యుత్‌ కార్లు త్వరలోనే పాపులర్‌ అవుతాయని చెప్పారు. కియా ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే కార్ల ఉత్పత్తిపై కూడా కేంద్రీకరించినట్లు తెలిపారు.

ప్రధానంగా సీఎన్‌జీ, హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే కార్లను కూడా మార్కెట్‌లోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. డీజిల్‌ కార్ల అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో 40-45 శాతం ఉంటాయని తెలిపారు. ఆధునీకరించిన సోనెట్‌ 25 భద్రతపరమైన ఫీచర్స్‌తో తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని చెప్పారు. ఇండియా నుంచి ఇక నుంచి 100 దేశాలకు కార్లను ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement