తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్‌కాన్ బెంగళూర్ ప్లాంట్‌లో మరో 461 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న ఫాక్స్‌కాన్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఒక్కో షేరును 10 రూపాయలు చొప్పున 46,08,76,736 షేర్లను సింగపూర్ ఫాక్స్‌కాన్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఫాక్స్‌కాన్ ప్రెసిషన్‌ను ఆరు నెలల క్రితం ఏర్పాటు చేశారు. మరో వైపు దేవనహళ్లిలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో 8,900 కోట్లతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని ఫాక్స్‌కాన్ గత జులైలో ప్రకటించింది. అందుకోసం 300 ఎకరాల స్థలాన్ని కంపెనీ కొనుగోలు చేసింది. తొలి దశలో ఈ ప్లాంట్‌లో 50 వేల మంది వరకు ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.