Friday, November 22, 2024

మరో 20 కేఎఫ్‌సీ ఎకో ఫ్రండ్లీ రెస్టారెంట్లు..

ఈ సంవత్సరం కేఎఫ్‌సి ఇండియా దేశంలో 20 ఎకో ఫ్రండ్లీ రెస్టారెంట్లను ప్రారంభించాలని నిర్ణయించింది. తక్కవ విద్యుత్‌ను వినియోగించుకునే విధంగా మొదటి ఎకోఫ్రండ్లీ చెన్నయ్‌లోని టీ నగర్‌లో ఆదివారం నాడు కంపెనీ ప్రారంభించింది. ఇలాంటి రెస్టారెంట్లను దేశంలోని వివిధ నగరాల్లో ఈ సంవత్సరం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. 2030 నాటికి 46 శాతం పర్యావరణానికి హాని కల్గించే కాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రకటించిన ప్లాన్‌లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి ప్లాస్టిక్‌కు బదులుగా తిరిగి ఉపయోగించే, లేదా రిసైక్లింగ్‌ మెటీరియల్‌ను ఉపయోగించనుట్లు తెలిపింది.

తమ కస్టమర్లకు భవిష్యత్‌లో కాలుష్యరహిత సమాజాన్ని ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని కేఎఫ్‌సి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ మీనన్‌ తెలిపారు. రెస్టారెంట్‌కు వినియోగించిన సోలార్‌ ప్యానల్స్‌ నుంచి ఏడాదికి 18000 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వాష్‌ రూమ్స్‌ కోసం వినియోగించే నీటిని వంద శాతం ఆర్వో విధానంలో సేకరిస్తున్నట్లు పేర్కొంది. ఎల్‌ఈడీ లైట్స్‌, ఇతర మెటిరీయల్స్‌ వల్ల విద్యుత్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించకలుగుతామని తెలిపింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement