Thursday, November 21, 2024

పాల ధరలు పెరగవ్‌, ఆర్థిక ఒత్తిడి ఉన్నా స్థిరంగానే ధరలు.. అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధీ

లాజిస్టిక్స్‌, ప్యాకేజింగ్‌ ఖర్చులు పెరుగుతున్నా.. ఆర్థికంగా సంస్థ ఒత్తిడికి గురవుతున్నా.. పాల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని దిగ్గజ డెయిరీ సంస్థ అమూల్‌ మంగళవారం ప్రకటించింది. పాల ధరలు స్థిరంగానే ఉంటాయని, పెంచే ఆలోచనలో తాము లేమని అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధీ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ధరలు స్థిరంగానే ఉంటాయని, ఎప్పుడు పెంపు ఉంటుందనేదానిపై స్పష్టత లేదన్నారు. అయితే ఇక ముందు పాల ధరలు పెరుగుతాయే తప్ప.. తగ్గవని స్పష్టం చేశారు. మార్కెట్‌లో డెయిరీ సంబంధిత వనరుల ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. సహకార సంఘం గతనెలలో లీటర్‌ పాల ధరను రూ.2 పెంచడంతో సహా గత రెండేళ్లలో 8 శాతం ధరలు పెంచిందని సోధీ తెలిపారు. ద్రవ్యోల్బణం అనేది ఇందులో కీలకమైన అంశంగా చెప్పుకొచ్చారు. ధరల పెంపునకు ద్రవ్యోల్బణం కూడా కారణమని వివరించారు. ఆర్బీఐకి చెందిన ఆరుగురు సభ్యుల రేట్ల సెట్టింగ్‌ ప్యానెల్‌ బుధవారం నుంచి ద్వైమాసిక సమీక్ష సమావేశాన్ని ప్రారంభించిందని తెలిపారు.

ద్రవ్యోల్బణ ఆందోళన అక్కర్లేదు..

తన పరిశ్రమలో ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. అధిక ధరల ద్వారా రైతులు ప్రయోజనం పొందుతున్నారని, అమలూ, విస్తృత పాడి పరిశ్రమల విస్తరణ ఇతరులతో పోలిస్తే చాలా పరిమితంగా ఉన్నాయని వివరించారు. ఇన్‌పుట్‌ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. కోల్డ్‌ స్టోరేజీ ఖర్చులపై ప్రభావం చూపే ఇంధన ధరలు మూడింట ఒక వంతుకు పైగా పెరిగాయని, లాజిస్టిక్స్‌ ఖర్చులు కూడా ఇదే విధంగా పెరిగాయని, ప్యాకేజింగ్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఒత్తిళ్ల కారణంగానే.. లీటర్‌ పాలపై రూ.1.20 పెరిగిందని, మహమ్మారి సమయంలో రైతుల ఆదాయం లీటర్‌కు రూ.4 వరకు పెరిగిందన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం వంటి ప్రపంచ ప్రతికూల పరిణామాలు భారతీయ పాడి పరిశ్రమకు మంచిది అని, ప్రపంచ చైన్‌ సప్లయి అంతరాయం ఏర్పడినందున.. భారతీయ ఎగుమతులకు సహాపడుతాయని సోధీ చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement