Saturday, January 25, 2025

Amul | పాల ధర తగ్గించిన అమూల్‌..

ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్‌ పాల ధరను తగ్గించింది. మూడు రకాల పాలపై లీటర్‌కు ఒక రూపాయి చొప్పు తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అమూల్‌ గోల్డ్‌, అమూల్‌ తాజా, అమూల్‌ టీ స్పెషల్‌పై ఈ తగ్గింపు ఉంటుందని అమూల్‌ పాలను విక్రయిస్తున్న గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఎండీ జయేన్‌ మెహతా తెలిపారు.

తగ్గింపు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందిని ఆయన తెలిపారు. రూపాయి తగ్గింపు తరువాత అమూల్‌ గోల్డ్‌ పాల ధర లీటర్‌కు 65 రూపాయలు, అమూల్‌ టీ స్పెషల్‌ ధర లీటర్‌కు 61 రూపాయలు, అమూల్‌ తాజా ధర 53 రూపాయలుగా ఉంటుంది. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ తట్టుకునేందుకు, మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ధర తగ్గించినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement