Thursday, November 21, 2024

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు షురూ.. ఈమెయిల్‌ ద్వారా సిబ్బందికి సందేశం

అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఉద్యోగాల్లో కోతలకు శ్రీకారం చుట్టింది. పభావిత ఉద్యోగులకు తొలగింపు గురించి అధికారిక మెయిల్‌ వచ్చింది. ప్రత్యామ్నాయాన్ని చూసుకునేందుకు వారికి రెండు నెలల గడువు ఇచ్చింది. సంస్థలో కొన్ని రకాల కొలువులను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున ఖర్చులు తగ్గించే చర్యలను అమలు చేయడానికి శ్రామిక శక్తిని తగ్గించే ప్రక్రియను బుదవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ తొలగింపులు అమెజాన్‌ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌పై ప్రభావం చూపుతుంగా, ఇది ప్రధానంగా దాని పరికరాలు, సేవల సంస్థలపై ప్రభావం చూపుతుంది. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ అనివార్యమైందని లింప్‌ తెలిపారు. దీనివల్ల ప్రభావితమయ్యే వారికి కొత్త పని కల్పించడంలో సహకారం అందిస్తామని చెప్పారు. దాదాపు 10వేల మందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ, నిర్దిష్టంగా ఎంతమందిి తొలగిస్తారనే దానిపై అమెజాన్‌ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

చాలా లోతైన్‌ సమీక్షల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులు స్థిరీకరించాలని నిర్ణయించాం. దీని పర్యవసానంగా కొన్ని రకాల ఉద్యోగాలుసంస్థకు అసలు అవసరమే లేదని తేల్చాం. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉంది. ఈ నిర్ణయంతో కొందరు ప్రతిభావంతు లను దూరం చేసుకోవాల్సి వస్తోంది అని లింప్‌ తన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా డివైజెస్‌, రిటైల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగాల్లో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement