Tuesday, November 26, 2024

కస్టమర్లని ప్రోత్సహిస్తున్న అమెజాన్‌ పే యూపీఐ..

ప్రభన్యూస్ : సురక్షితంగా లావాదేవీలు చేయడానికి కస్టమర్లని ప్రోత్సహిస్తున్న అమేజాన్‌ పేయూపీఐ, కాంటాక్ట్‌ లెస్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ వంటి ప్రసిద్ధి చెందిన చెల్లింపు పద్ధతుల సౌలభ్యం మద్దతుతో భారతదేశం ఫిన్ టెక్‌ విప్లవంలో ఉంది. ప్రయాణం టిక్కెట్స్‌ బుక్‌ చేయడానికి, రెస్టారెంట్స్‌ లో చెల్లించడానికి, రీఛార్జ్‌ (మొబైల్‌, డీటీ హెచ్‌, ఫాస్టాగ్‌) కోసం, షాపింగ్‌, ఎన్నో ఇతర అవసరాలు కోసం, తమ యుటిలిటి బిల్స్‌, బీమా ప్రీమియాలు కోసం చెల్లించడానికి సౌకర్యం, భద్రత, బహుమతులు ద్వారా ప్రోత్సహించబడిన లక్షలాది మంది కస్టమర్స్‌ రోజూ డిజిటల్‌ చెల్లింపులు చేస్తారు.

వేరొక మాటల్లో చెప్పాలంటే, డిజిటల్‌ చెల్లింపులు అనేవి కస్టమర్లకు ప్రతి రోజూని సులభం చేస్తున్నాయి. అయితే, డిజిటల్‌ చెల్లింపుల్ని అతి వేగంగా అనుసరించడం వలన సైబర్‌, చెల్లింపుకు సంబంధించిన మోసాల సంఘటనలకు దారితీస్తున్నాయి. మీ డిజిటల్‌ ప్రయాణం జీవితాన్ని సురక్షితం, సౌకర్యవంతం చేయడానికి అమేజాన్‌ పే మీ కోసం సలహాల్ని అందిస్తోంది. పర్శనల్‌ అకౌంట్‌ వివరాలు గురించి జాగ్రత్తగా ఉండాలని, పిన్‌, ఓటీపీ లేదా సీవీవీ నంబర్‌ వంటి తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియచేయ వలసిందిగా అమేజాన్‌ కస్టమర్స్‌ ని ఎన్నడూ అడగదని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement