హైదరాబాద్ (ప్రభన్యూస్) : అమెజాన్ సంస్థ తన ఎక్స్ పోర్ట్స్ డైజెస్ట్ 2022ని ఆవిష్కరించింది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమంలో భారతీయ ఎగుమతిదారులు 5బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే దారిలో ఉన్నారని ఈ సందర్భంగా ప్రకటించింది. అమెజాన్ ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ విభాగం ఎస్‌వీపీ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ…. తమ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 1లక్షకు పైగా ఎగుమతిదా రులు చూస్తున్న గణనీయమైన వృద్దితో తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా 2025 నాటికి భారతదేశం నుంచి మొత్తం ఎగుమతులను 10 బిలియన్ డాలర్ల మేరకు సాధిస్తామని 2020లో అమెజాన్ ప్రతిజ్ఞ చేసిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..