భారత్‌లో మార్కెట్‌ను మరింత విస్తరించాలని ఈ కామర్స్ బ్రాండ్ అమెజాన్ యోచిస్తోంది. ‘అమెజాన్ బజార్’ ద్వారా దేశంలో తక్కువ ధరలకు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ద్వారా నాన్-బ్రాండెడ్ వస్తువులను రూ.600 కంటే తక్కువ ధరకు విక్రయిస్తుంది.
బట్టలు, బూట్లు, వాచెస్, ఆభరణాలు ఇంకా ఇతర వస్తువులను వీలైనంత త్వరగా లిస్ట్ చేసి, వాటిని ఎటువంటి బ్రాండింగ్ లేకుండా అమెజాన్ బజార్ ద్వారా విక్రయించాలని కంపెనీ ఇప్పటికే వ్యాపారులకు చెప్పింది. అమెజాన్ బజార్‌లో కస్టమర్లు చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. డెలివరీకి 2-3 రోజులు మాత్రమే పడుతుంది.