Sunday, November 24, 2024

Toyota నుంచి అదిరిపోయే కారు.. లాంచ్ డేట్, ఫీచర్స్ వివరాలు ఇవే..!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా భారత మార్కెట్లోకి మరో కళ్లు చెదిరే ఎస్‌యూవీ ‘‘టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌’’ను తీసుకురానుంది. ఇది ఏప్రిల్ 03న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కారు మారుతి సుజుకి ఫ్రాంక్‌లను పోలి ఉంటుంది. మరి దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

స్పెసిఫికేషన్స్ (అంచనా) :

రాబోయే టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్. దీనినే కొన్ని స్వల్ప మార్పులతో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇది ఫ్రాంక్స్‌తో సమానంగా ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్స్ తో వస్తుంది. ఇందులో 1.0-లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్ 100hp శక్తిని మరియు 147Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90hp గరిష్ట శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

80 శాతం మంది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్న ఫ్రాంక్స్ ను కొంటున్నారు, దీంతో టయోటా అర్బన్ కూడా ఇదే ఇంజిన్ తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కారు కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు, కొత్త ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రివైజ్డ్ టెయిల్ ల్యాంప్‌లతో కూడిన కొత్త రియర్ బంపర్‌తో వస్తుంది. దీని డ్యాష్‌బోర్డ్ ఫ్రాంక్స్‌ను పోలి ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మెరుగైన స్టాండర్డ్ వారెంటీని కూడా ఇస్తుంది.

హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360 డిగ్రీ కెమెరా, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కలర్ ఎంఈడీ స్క్రీన్‌ కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. వీటితోపాటు వైర్‌లెస్ ఛార్జర్, ఓటీఏ అప్‌డేట్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫాస్ట్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, వాయిస్ అసిస్టెన్స్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను కూడా పొందవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7,60,000 నుంచి ప్రారభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement